రాజన్న సిరిసిల్ల జిల్లా వర్లంపల్లిలో భూ సమస్య పరిష్కారం కావడం లేదంటూ కర్ల రవి అనే యువకుడు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. తన సమస్యపై అధికారులకు, పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న ఇల్లంతకుంట పోలీసులు అక్కడికి చేరుకుని రవితో మాట్లాడారు. సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో యువకుడు టవర్ దిగి కిందకు వచ్చాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.