పెళ్లికావట్లేదని మనస్థాపంతో యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో చోటు చేసుకుంది. మాధవరెడ్డి బ్రిడ్జి సమీపంలో బూర నరేష్ అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ ఆత్మకూరు కి చెందిన నరేష్ హైదరాబాద్ లోని అమీర్పేట్ లో ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటూ బట్టల షాపులో ఉద్యోగం చేస్తున్నాడు. గత నాలుగేళ్లుగా పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్తాపానికి గురైన నరేశ్.. రేపల్లె ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.