శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతమవుతోంది. గత పది రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ప్రజలు, తమ నిరసనను వినూత్న రీతిలో తెలుపుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఆటో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి, ప్రధాన కూడలిలో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు మద్దతు తెలుపుతున్నారు.