శ్రీ సత్య సాయి జిల్లా నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లికి చెందిన ధనంజయ అలియాస్ షేక్ మహమ్మద్ అసిఫ్ అనే యువకుడు పాకిస్తాన్కు అనుకూలంగా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడం తీవ్ర దుమారం రేపింది. కొన్నేళ్ల క్రితం హిందూ మతం నుంచి ఇస్లాం మతాన్ని స్వీకరించిన ఈ యువకుడు.. ఇటీవల 'పాకిస్తాన్ జిందాబాద్' అంటూ వీడియోలు పెట్టాడు. దీంతో ఆగ్రహించిన స్థానిక యువకులు నల్లచెరువు పోలీస్ స్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించిన ధనంజయ అలియాస్ మహమ్మద్ అసిఫ్పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.