కాకినాడ జిల్లా పెద్దాపురంలోని రాయభూపాలపట్నం గ్రామంలోని శ్రీ లక్ష్మి గణపతి ఆలయంలో చోరీ జరిగింది. సుమారు పది లక్షల రూపాయల విలువైన ఏడు కేజీల వెండి ఆభరణాలను దొంగిలించారు. ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని, ఆభరణాలు చోరీకి గురవడాన్ని గుర్తించి గ్రామ పెద్దలకు, ఆపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో దర్యాప్తు ప్రారంభించారు. డాగ్ స్క్వాడ్ గ్రామం శివారులోని కైలాస భూమి వద్ద ఆగిపోగా, అక్కడ మద్యం సేవించిన ఆనవాళ్లు కనిపించాయి. పోలీసులు మద్యం బాటిల్‌పై ఉన్న వేలిముద్రలను సేకరించారు. దొంగలను పట్టుకోవడానికి సమీపంలోని సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు.