కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2025లో భాగంగా 9వ మ్యాచ్లో, ఆంటిగ్వా, బార్బుడా ఫాల్కన్స్ ఆటగాడు ఫాబియన్ అల్లెన్ అద్భుతమైన ఫీల్డింగ్ చేశాడు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. గాల్లోకి దూకి సిక్స్ వెళ్తున్న బంతిని ఆపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.