తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత భద్రాచలంలో ఒక విచిత్రమైన సంఘటన వెలుగుచూసింది. ఎన్నికల్లో గెలవడానికి ఓటర్లకు భారీగా డబ్బులు పంచిన అభ్యర్థులు, తీరా ఓడిపోవడంతో ఇప్పుడు ఆ డబ్బులను తిరిగి వసూలు చేస్తున్నారు. భద్రాచలం 14వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బండారి నాగేశ్వరరావు.. ఓటర్ల ఇంటికి వెళ్లి తన డబ్బులు తనకు ఇచ్చేయాలని ఆడుగుతున్నాడు. తాము అడగకపోయినా ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చి, ఇప్పుడు ఓడిపోగానే బెదిరించి మరీ వసూలు చేయడంపై వార్డు ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అభ్యర్థులు అయితే డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తుండటంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు.