నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని గ్రామస్థులు వింత ఆచారాన్ని ఫాలో అవుతున్నారు. జేష్ట లక్ష్మి.. జెట్టక్క వెళ్లిపో.. లక్ష్మిదేవి రా అంటూ పాత దుస్తులు వేసుకొని పాత చీపుర్లు,చాటలతో ఒకరినొకరు కొట్టుకుంటూ గ్రామ శివారు పొలిమేర్ల వరకు నినాదాలు చేస్తూ నృత్యాలు చేశారు. ఇలా చేయడం వల్ల.. గ్రామానికి పట్టిన జెట్టక్క తొలగిపోయి ప్రజలంతా సుఖ శాంతులతో జీవిస్తారని, దీర్ఘ కాలిక సమస్యలకు తావుండదని గ్రామస్తులు నమ్ముతారు.