భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం లభించింది. ముంబైలోని వాంఖడేలో భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరు మీద స్టాండ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. నా పేరు మీద ఒక స్టాండ్ కలిగి ఉండటం చాలా ప్రత్యేకమైన అనుభూతి అవుతుంది. భారతదేశం ఇక్కడ ఏ జట్టుతో ఆడినా, అది మరింత ప్రత్యేకంగా ఉంటుంది. ఈ పెద్ద గౌరవం లభించినందుకు నేను కృతజ్ఞుడను’’ అని అన్నాడు.