అడవిలో బలమైన జంతువుదే ఆధిపత్యం. ఎలాంటి పరిస్థితిలోనూ తనను తాను రక్షించుకోగలిగిన జంతువు మాత్రమే మనుగడ సాగిస్తుంది. అడవి జంతువుల మధ్య పోరాటాలు ఎన్నో సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. వీటిలో కొన్ని నెటిజన్లకు బాగా నచ్చుతుంటాయి. తాజాగా మరో వైరల్ వీడియో కూడా ఈ లిస్ట్‌లో చేరింది. ఇందులో ఒక కొండచిలువ తనను తాను రక్షించుకోవడానికి పులితో పోరాడింది. కానీ, పులి ముందు పిచ్చి వేశాలు వేస్తే ఎలాంటి వారికైనా ఎలాంటి పరస్థితి ఎదురవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.