నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ కార్యాలయం వద్ద శివనేనిగూడెం గ్రామస్తులు భారీ ఆందోళన చేపట్టారు. తమ గ్రామంలో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ, మున్సిపల్ కార్యాలయం ముందే చెత్తను పోసి వినూత్నంగా నిరసన తెలిపారు. గత ఐదేళ్లుగా డంపింగ్ యార్డ్ నుంచి వస్తున్న పొగ, కాలుష్యం వల్ల తాము తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నామని, అధికారులు కేవలం మాటలతో కాలయాపన చేస్తున్నారని గ్రామస్తులు మండిపడ్డారు. యార్డును తొలగిస్తామని అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని గ్రామస్తులు భీష్మించుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.