శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో పందులు బెంబేలెత్తిస్తున్నాయి. సత్యసాయి నగర్లో నివాసం ఉంటున్న రజియా అనే మహిళ తన ఇంటి ముందు పని చేసుకుంటుండగా, ఒక పంది అకస్మాత్తుగా ఆమెపై దాడి చేసింది. ఆ మహిళ తేరుకునే లోపే రెండు చేతి వేళ్లను పంది కొరికేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. పంది ఆమె మెడపై దాడి చేసే ప్రయత్నం చేయగా, స్థానికులు గమనించి ప్రాణాపాయం నుండి రక్షించారు. పట్టణంలో పందులు, కుక్కల బెడద తీవ్రంగా ఉన్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. చిన్నపిల్లలపై ఇలాంటి దాడులు జరిగితే వారి ప్రాణాలకే ముప్పని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పట్టణంలో పందుల స్వైర విహారానికి అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.