ప్రకాశం జిల్లా కనిగిరిలో మతిస్థిమితం సరిగా లేని ఓ యువకుడు కత్తితో హల్చల్ చేశాడు. ఓ ఇంట్లో పూజ చేసుకుంటున్న మహిళపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో మహిళకు గాయాలయ్యాయి. మహిళ కేకలు విని అప్రమత్తమైన స్థానికులు మతిస్థిమితం సరిగా లేని యువకుడ్ని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తల, శరీర భాగాల్లో కత్తి గాట్ల కి గురైన మహిళ సుబ్బులును చికిత్స కోసం హాస్పటల్ కి తరలించారు. ఈ ఘటనపై కనిగిరి పోలీసులు విచారణ జరుపుతున్నారు.