జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం సమీపంలోని చెట్ల పొదల్లో కాలిన స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ మృతదేహం పారిశుధ్య కార్మికుడు అంజయ్యదిగా గుర్తింపు. మృతుడికి ఫిట్స్ సమస్య ఉండడంతో చెత్త కాల్చే సమయంలో ప్రమాదవశాత్తు మంటల్లో పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్మార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.