అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన పులేటిపల్లి స్పందన.. ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. ధర్మవరంలోని మరో కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న మరో విద్యార్ధి.. స్పందనతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. వైఖరి మార్చుకోవాలని స్పందన హెచ్చరించగా.. ఆ విద్యార్ధి దుర్భాషలాడుతూ విచక్షణార హితంగా బస్సులోనే దాడి చేశాడు. బస్సు దిగి కాలేజీకి వెళ్తున్న సందర్భంలోనూ మరోసారి దాడి చేశాడు. దీంతో ధర్మవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో తనతో అసభ్యంగా ప్రవర్తించిన విద్యార్థిపై స్పందన ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఘటనచెన్నేకొత్తపల్లి పరిధిలో జరిగిందని, అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేయాలని విద్యార్థినికి చెప్పి పోలీసులు పంపేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురై.. స్పందన ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల అలసత్వం వల్లే తమ కుమార్తె చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.