తిరుమల నడక మార్గంలో ఏనుగుల సంచారం కలకలం రేపింది. మొదటి ఘాట్ రోడ్డు కలిసే ఏడో మైలు సమీపాన ఉన్న ఆంజనేయస్వామి గుడి వద్ద ఏనుగులు సంచరిస్తున్నట్లు టీటీడీ విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులకు భక్తులు సమాచారం అందించారు. దీంతో వాటిని అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల తరచూ ఏనుగులు కాలినడక మార్గం వద్దకు వస్తుండటంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు