ఉపాధి హామీ పథకంలో దొంగ బిల్లులు చేస్తున్నారని ఫీల్డ్ అసిస్టెంట్ పై విచారించి చర్యలు తీసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా సోమరాజుకుంట గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఎంపీడీవో పార్థసారథి గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. తనపై ఫిర్యాదు చేస్తారా అంటూ ఫీల్డ్ అసిస్టెంట్ ప్రసాద్ గ్రామస్తులపై తిరగబడి దాడి చేశారు. దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గ్రామస్తులు ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.