శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని శ్రీకృష్ణ గార్డెన్ హోటల్లో బిర్యానీ విషయంలో హోటల్ సిబ్బంది, కస్టమర్ మధ్య ఘర్షణ జరిగింది. బిర్యానీ ఆర్డర్ ఇచ్చి చాలా సేపైనా..తీసుకురాలేదంటూ ఫుల్లుగా మద్యం సేవించి హోటల్‌కు వచ్చిన కస్టమర్ కుర్చీలను ధ్వంసం చేసి సిబ్బందితో గొడవకు దిగాడు. దీంతో ఈ వివాదం చెలరేగి రోడ్డుపైనే రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. కస్టమర్ స్నేహితులు, హోటల్ సిబ్బంది రోడ్డుపై ఒకరిపై మరొకరు దాడి చేసుకుని హంగామా చేశారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పోలీసులు ఇరు వర్గాలకు సర్దిచెప్పారు.