ఖమ్మం జిల్లా కలకొడిమ గ్రామంలో కన్న కొడుకునే ఓ తండ్రి హతమార్చాడు. మద్యానికి బానిసైన కొడుకు.. ఇటీవల తండ్రిపై దాడి చేశాడు. దీంతో కొడుకు నాగరాజును చంపాలని పథకం రచించిన తండ్రి మద్యంలో పురుగుల మందు కలిపి.. కొడుక్కి తాగించాడు. నాగరాజుకు వాంతులు, విరేచనాలు కావడంతో.. ఏమి తెలియనట్టు తండ్రే కొడుకును చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించాడు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాధితుడి పెద్దమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.