ఖమ్మం జిల్లా నేలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు దంపతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కార్యాలయం ఎదుట అడ్డంగా పడుకొని తనకు న్యాయం చేయాలని గువ్వలగూడెం గ్రామానికి చెందిన రామదాసు దంపతులు ఆందోళన చేపట్టారు. తన భార్య భారతమ్మ పేరు మీద భూమి ఉన్నట్టు రికార్డుల్లో ఉన్నప్పటికీ అధికారులు మాత్రం భూమి చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 229 సర్వే నెంబర్లో 36 కుంటల భూమి తక్కువగా ఉందని 2013 లో హైకోర్టుకు వెళ్ళాడు. 2024 లో బాధితుడి భూమి సర్వే చేసి ఆయనకు న్యాయం చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి తహశీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోవడం లేదని రైతు వాపోయాడు.