ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో మద్యం మత్తులో ఉన్న లాజర్ అనే వ్యక్తి విచిత్రంగా ప్రవర్తించి కలకలం సృష్టించాడు. చేపల వలలో చిక్కిన భారీ కొండచిలువను చంపి, చనిపోయిన ఆ పామును తన మెడలో వేసుకుని వీధుల్లో తిరిగాడు. అంతేకాక అదే కొండచిలువతో ఓరియంటల్ హైస్కూల్లోకి వెళ్లడంతో, విద్యార్థులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. లాజర్పై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.