పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని చంద్రవంక వాగులో మొసలి కలకలం రేపింది. రామా టాకీస్ లైన్ ప్రాంత ప్రజలు వాగు దగ్గరకు వెళ్లగా అక్కడ మొసలిని గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు మొసలిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. వాగులో మొసలి ఉన్న కారణంగా అక్కడికి ఎవరు వెళ్లవద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.