రాజేంద్రనగర్ ప్రాంతంలో గుండెలు అదిరే ఘటన జరిగింది. హైదర్‌గూడ శివానగర్లోని ఓ ఇంట్లో ఆరవ్ మెహతా అనే 18 నెలల చిన్నారి ఆడుకుంటూ పొరపాటున గది తలుపులు లోపల వైపు లాక్ చేసుకున్నాడు. తలుపులు ఎంత ప్రయత్నించినా తెరచుకోకపోవడంతో, ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం హుటాహుటిన అక్కడికి చేరుకుంది. సిబ్బంది చాకచక్యంగా తలుపులను బ్రేక్ చేసి, చిక్కుకుపోయిన చిన్నారి ఆరవ్‌ను సురక్షితంగా బయటకు తీశారు. తమ కుమారుడు క్షేమంగా బయటపడటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.