మెదక్ జిల్లా రామాయంపేట అయ్యప్ప దేవాలయం సమీపంలో అర్ధరాత్రి కారు ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. దీంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.