రంగా రెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహెడ గుట్టమీద ఉన్న పురాతన హనుమాన్ దేవాలయం వద్ద గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. చేతిలో హుక్కా పట్టుకుని తిరుతుండడాన్ని గమనించిన భక్తులు.. వారిని పోలీసులకు అప్పగించారు. దేవాలయ ప్రాంగణంలో కొంతమంది అన్యమతస్తులు.. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ భక్తుల ఆగ్రహం చేస్తున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉండాల్సిన ప్రాంతాన్ని అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.