నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురంలో శివన్న అనే ఇంట్లో 6 అడుగుల నాగుపాము హల్చల్ చేసింది. రాత్రి ఇంట్లో చిన్న పిల్లలు నిద్రపోతున్న సమయంలో నాగుపామును చూసి కుటుంబీకులు భయభ్రాంతులకు గురైయ్యారు. స్నేక్ క్యాచర్ మోహన్‌కు సమాచారం ఇవ్వగా అతడు.. పామును సంచిలో బంధించి అడవిలో వదిలేశాడు. దీంతో శివన్‌ను కుటుంబం ఊపిరి పీల్చుకుంది.