మహాబళేశ్వరంలో తయారైన 25 అడుగుల భారీ శివలింగం, పాట్నాకు తరలించే మార్గంలో కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద ఆగింది. బుగ్గరామేశ్వర స్వామి ఆలయం వద్ద లారీ ఆగగా, శివలింగాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వేకువజామున పూజారి మనోహర్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక రక్షా పూజలు, మంగళహారతి నిర్వహించారు. యాత్రలో ఎలాంటి ఆటంకాలు లేకుండా శివలింగం పాట్నాకు శుభంగా చేరాలని ప్రార్థించినట్లు ఆలయ వర్గాలు తెలిపారు.