శ్రీశైలంలో భారీ కొండచిలువ జనారణ్యంలోకి వచ్చింది. రాత్రి సమయం కావడంతో నివాస గృహాల మధ్య సుమారు 12 అడుగుల కొండచిలువ హల్ చల్ చేసింది. శ్రీశైలం సమీపంలోని సుండిపెంట గ్రామంలో అయ్యప్పస్వామి గుడి సమీపంలో ఈ భారీ కొండచిలువ ఒక నివాస గృహం వద్ద కాంపౌండ్ వాల్‌ను ఆనుకుని పడుకుంది. కొండచిలువను చూసిన పరిసర ప్రాంతాలవారు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో స్నేక్ క్యాచర్ రమేష్ కొండచిలువ ఉన్న ప్రాంతానికి చేరుకుని చాకచక్యంగా కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి వదిలేశాడు.