ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన 91 ఏళ్ల వయసున్న రాయల వెంకటేశ్వర్లు అనే వృద్ధుడు ఎన్నికల బరిలోకి నిలిచారు. సిపిఎం నుంచి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా రాయల వెంకటేశ్వర్లు నామినేషన్ వేసి ప్రజల వద్దకు వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.ఎన్నికల్లో పోటీ చేయడానికి వయసు తనకు అడ్డుకాదని ఆయన తెలిపారు. తమ గ్రామం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని, అందుకే ప్రజల కోరిక మేరకే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని అన్నారు. 30 ఏళ్లుగా ఉప సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై గ్రామంలో ప్రజలకు అనేక సేవలు అందించానని రాయల వెంకటేశ్వర్లు తెలిపారు.