పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఎస్పీ అద్నాన్ నయిం ఆస్మిని డిజిటల్ అరెస్ట్ బాధితుడు శర్మ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. శర్మను డిజిటల్ అరెస్టు చేసామని భయపెట్టి బ్యాంకు అకౌంటు నుంచి సైబర్ నేరగాళ్లు 78 లక్షలు కాజేసారు. మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కంబోడియా నుంచి అపరేట్ చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న 13మందిని అరెస్ట్ చేసి నిందితుల నుంచి 61 లక్షలు రికవరీ చేశారు. దీంతో తన డబ్బు తిరిగి అందించినందుకు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి శర్మ శాలువాతో సత్కరించారు. సైబర్ నేరగాళ్ళ పట్ల సీనియర్ సిటిజెన్లు చాలా జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు.