వచ్చే ఏడాది ఫిబ్రవరి 28, మార్చి 1 వ తేదీల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో 3వ ప్రపంచ తెలుగు మహా సభలు నిర్వహిస్తున్నట్లు కిమ్స్ వైద్య కళాశాల ఛైర్మన్ చైతన్య రాజు తెలిపారు. ఆదివారం అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో జరిగిన కార్యక్రమంలో తెలుగు మహాసభల పోస్టర్ను రాష్ట్ర ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆవిష్కరించారు. తెలుగు మహా సభలకు తొలి రోజున సీఎం చంద్రబాబు నాయుడు, రెండవ రోజున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతారని తెలిపారు.