భారత్ క్షిపణి దాడులతో పాక్ ఉలిక్కిపడింది. ఆ దేశంలోని రావల్పిండి, ఇస్లామాబాద్, బహ్వాల్పూర్ నగరాల్లో అక్కడి ప్రభుత్వం మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. అన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్‌ను అలర్ట్ చేసింది. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఇండియా దాడులు కొనసాగిస్తుందేమో అన్న భయంతో నష్ట నివారణ చర్యలు చేపట్టింది.