Share News

Handkerchief Dresses: హ్యాండ్‌కర్చీఫ్‌ డ్రెస్‌ హవా!

ABN , Publish Date - Apr 30 , 2025 | 04:04 AM

వినూత్నంగా రూపొందుతున్న హ్యాండ్‌కర్చీఫ్‌ డ్రెస్సులు ఇప్పుడు మహిళల్లో హాట్‌ ఫేవరెట్‌ అవుతున్నాయి. సౌకర్యం, అందం రెండింటినీ సమపాళ్లలో కలిపే ఈ డ్రెస్సులను సరైన యాక్సెసరీస్‌తో కాంబినేషన్‌లో ధరించితే మరింత ఆకర్షణీయంగా ఉంటాయి.

Handkerchief Dresses: హ్యాండ్‌కర్చీఫ్‌ డ్రెస్‌ హవా!

వినూత్నమైన పోకడలు నిరంతరం పుట్టుకొస్తూనే ఉంటాయి. అలాంటిదే ‘హ్యాండ్‌కర్చీఫ్‌ డ్రెస్‌’. సౌకర్యం ప్రధానంగా రూపొందుతున్న ఈ డ్రెస్సులు తాజాగా మహిళల మనసులను దోచేస్తున్నాయి. వాటి మీద ఓ లుక్కేద్దామా?

వేర్వేరు వస్త్రాలను భిన్నమైన కొలతలతో కత్తిరించి, వాటన్నిటినీ జోడించి తయారుచేసేదే హ్యాండ్‌కర్చీఫ్‌ డ్రెస్‌. ఈ వస్త్రాల మూలలన్నీ కిందకు వేలాడుతూ, డ్రస్సుకు భిన్నమైన లుక్‌ను అందిస్తాయి. ఈ వినూత్నమైన డ్రెస్‌ అందం రెట్టింపు కావాలంటే, డ్రెస్సుకు తగిన యాక్సెసరీస్‌ను కూడా జోడించాలి. ఈ డ్రెస్‌ ఆకర్షణను ద్విగుణీకృతం చేసే అంశాలు ఇవే...

తప్పనిసరిగా పెన్సిల్‌ హీల్‌ లేదా బూట్స్‌ వేసుకోవాలి

వీలైనంత తక్కువ జ్యువెలరీ వేసుకోవాలి

పెద్ద డయల్‌ వాచీలు, బ్యాంగిల్స్‌ వేసుకోవచ్చు

చెవులకు పొడవాటి, పెద్ద హ్యాంగింగ్స్‌ అందంగా ఉంటాయి

సెక్విన్‌, మిర్రర్‌ వర్క్‌ కలిగిన హ్యాండ్‌కర్చీఫ్‌ డ్రెస్‌లను వేడుకల్లో ధరించాలి

కాటన్‌, శాటిన్‌ హ్యాండ్‌కర్చీఫ్‌ డ్రెస్సులు ఎంతో సౌకర్యంగా ఉంటాయి

ఈవినింగ్‌ వేర్‌, క్యాజువల్‌ వేర్‌గా వీటిని ఎంచుకోవచ్చు

తేలికపాటి రంగుల హ్యాండ్‌కర్చీఫ్‌ డ్రెస్సులు వేసవికి ఎంతో బాగా నప్పుతాయి


ఇవి కూడా చదవండి..

Pakistan: భారత 'గూఢచారి డ్రోన్‌'ను కూల్చేశామన్న పాక్

Kashmir: కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులకు స్కెచ్.. 48 టూరిస్ట్ స్పాట్స్ మూసివేత..

Viral News: పాకిస్తాన్‎ను 4 ముక్కలు చేయాలి..ఇలా చేస్తేనే వారికి మేలు..

Updated Date - Apr 30 , 2025 | 04:04 AM