Pineapple: పైనాపిల్ సబ్జా షర్బత్
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:03 AM
వేసవి కాలంలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు సబ్జా గింజలు ఉపయోగపడతాయి. పైనాపిల్ మరియు సబ్జా గింజలతో తయారుచేసిన షర్బత్ తాగడం ఆరోగ్యానికి మంచిది.

శరీర ఉష్ణోగ్రతలను చల్లపర్చటంలో సబ్జా గింజలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వేసవిలో సబ్జా గింజల ఆధారిత షర్బత్‌లను తాగితే ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి. పైనాపిల్, సబ్జా గింజలతో కలిపి షర్బత్ ఎలా చేయవచ్చో తెలుసుకుందాం.
తయారీ విధానం
పైనాపిల్ పైన తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. ఈ ముక్కలను కుక్కర్‌లో వేసి రెండు కూతలు వచ్చే దాకా ఉడికించాలి. ఇలా ఉడికించటం వల్ల పైనాపిల్ మరింత రుచికరంగా తయారవుతుంది.
రెండు స్పూనుల సబ్జా గింజలను ఒక గిన్నెలో నీళ్లు పోసి నానబెట్టాలి.
ఉడికిన ముక్కలను మిక్సీలో వేసి ముద్దగా చేయాలి. ఈ ముద్ద నుంచి రసం పిండాలి.
ఈ రసంలో కొద్దిగా తేనె, మిరియాల పొడి, నిమ్మరసం వేసి కలపాలి. ఆ తర్వాత నానబెట్టిన సబ్జా గింజలను రసంలో వేసుకోవాలి.