Share News

Health Tips: అనారోగ్యానికి ఆహారంతో చెక్‌

ABN , Publish Date - May 01 , 2025 | 04:04 AM

చిన్న అనారోగ్య సమస్యల కోసం మందులు కాకుండా సహజ ఆహారాలతో నివారణ పొందవచ్చు. ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం ప్రతి సమస్యకు తగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

Health Tips: అనారోగ్యానికి ఆహారంతో చెక్‌

మనకు చిన్నచిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. ప్రతిదానికీ మందు బిళ్లలు మింగకుండా అందుబాటులో ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చంటున్నారు నిపుణులు.

అనుకోకుండా జ్వరం వస్తే వెంటనే కొబ్బరినీళ్లు తాగాలి. దీనివల్ల ఒంటి వేడి తగ్గుతుంది.

కడుపులో వికారంగా అనిపిస్తే అల్లం రసం తీసుకోవాలి. మైకం వచ్చినట్లు అనిపిస్తే పుచ్చకాయ ముక్కలు తినాలి.

ముఖం మీద మొటిమలు ఎక్కువగా వస్తూ ఉంటే రోజుకు అయిదు బాదం పప్పులు తినాలి.

నీరసంగా అనిపిస్తే ఖర్జూరం, నిద్ర సరిగా పట్టకపోతే కివి పండ్లు తినడం వల్ల మంచి ప్రయోజనం కనిపిస్తుంది.


రక్తహీనతతో బాధపడేటప్పుడు పాలకూర తింటే ఫలితం లభిస్తుంది

కీళ్ల నొప్పులకు వాల్నట్‌, కంటి సమస్యలకు కేరట్‌, శ్వాసకోశ సమస్యలకు వెల్లుల్లి తినాలి.

పొడి చర్మానికి అవకాడో, నోటి దుర్వాసన తగ్గేందుకు యాపిల్‌ తినాలి.

జీర్ణాశయంలో అరుగుదలకు మిరియాల టీ, కొలెస్ట్రాల్‌ తగ్గడానికి ఓట్స్‌ తీసుకోవాలి.

కాలేయం ఆరోగ్యంగా ఉండేందుకు దుంపలు, కడుపు నొప్పిగా ఉంటే పండిన బొప్పాయి తినాలి. కండరాల వాపును నిరోధించేందుకు పసుపు ఔషధంలా పని చేస్తుంది.


Also Read:

BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్‌ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ

Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..

Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..

Updated Date - May 01 , 2025 | 04:04 AM