Sink Cleaning Tips: వంటగది సింక్‌లో నీళ్లు పోవడం లేదా...
ABN , Publish Date - May 26 , 2025 | 01:16 AM
సింక్‌లో నీళ్లు నిలవకుండా ఉండాలంటే ప్రతినెలా బేకింగ్ సోడా, వెనిగర్‌తో శుభ్రం చేయాలి. గట్టిగా పేరుకున్న మురికి కోసం వేడి నీళ్లలో సర్ఫ్ కలిపి పోసితే పైప్ clog తొలగిపోతుంది.
మనం సాధారణంగా వంటగది సింక్‌లో వంట పాత్రలు, భోజనం చేసిన పళ్లాలు కడుగుతూ ఉంటాం. దీంతో ఒక్కోసారి సింక్‌లో దాని కింద ఉన్న పైప్‌లో వ్యర్థ పదార్థాలు పేరుకుని నీళ్లు పోకుండా అడ్డుపడుతుంటాయి. క్రమంగా సింక్ మురికి నీళ్లతో నిండి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇలా కాకుండా సింక్‌ను, దాని పైప్‌నూ ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందాం.....
సింక్ పూర్తిగా మురికి నీళ్లతో నిండిపోతే వెంటనే ప్లంజర్‌ను రంధ్రాలపై ఉంచి గట్టిగా నొక్కి తీయాలి. చిన్నపాటి అడ్డంకులు ఉంటే అవి తొలగి నీళ్లు వేగంగా మోరీలోకి పోతాయి. తరవాత వేడినీళ్లతో సింక్‌ను శుభ్రం చేసుకోవాలి.
సింక్‌లో అర కప్పు బేకింగ్ సోడా చల్లాలి. దానిమీద అరకప్పు వెనిగర్‌ను స్ర్పే చేయాలి. ఈ మిశ్రమం మెల్లగా సింక్ పైప్‌లోకి జారి అక్కడి వ్యర్థాలను కరగిస్తుంది. పావు గంట తరవాత ఒక గ్లాసు వేడి నీళ్లను సింక్‌లో పోస్తే వ్యర్థాలన్నీ తొలగి సింక్ శుభ్రపడుతుంది. ఇలా నెలకి ఒకసారి చేస్తూ ఉంటే సింక్‌లో సమస్యలు రావు.
ఒక్కోసారి సింక్ పైప్‌లో, అలాగే మోరీలో నూనెలు ఇతర వ్యర్థాలు గడ్డలా పేరుకోవడంతో సింక్‌లో నీళ్లు నిలిచిపోతుంటాయి. ఇలాంటప్పుడు మూడు గ్లాసుల వేడివేడి నీళ్లలో కొద్దిగా సర్ఫ్ లేదా షాంపూ వేసి బాగా కలిపి సింక్‌లో పోయాలి. ఇలా పది నిమిషాల వ్యవధితో రెండుసార్లు చేస్తే వ్యర్థాలన్నీ కరగిపోతాయి. సింక్ పైప్, మోరీ శుభ్రమవుతాయి.
ఒక గిన్నెలో అర కప్పు ఉప్పు వేసి అందులో నాలు గు చెంచాల నిమ్మరసం కలపాలి. రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని సింక్ లోపల పరచాలి. ఉదయం లేవగానే సింక్‌లో వేడి నీళ్లు చల్లాలి. అయిదు నిమిషాల్లో సింక్ పూర్తిగా శుభ్రమవుతుం ది. దుర్వాసన కూడా పోతుంది. వారానికి రెండుసార్లు ఇలా చేస్తూ ఉంటే సింక్‌లో నీళ్లు నిలవవు.
గిన్నెలు, పళ్లాలు కడిగిన వెంటనే సింక్‌లో మిగిలిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలి. బ్రష్‌తో సింక్‌ను రుద్ది నీళ్లు పోస్తూ శుభ్రం చేయాలి.
సింక్ కింద ఉన్న మోరీలో తరచూ ఒక బకెట్ వేడి నీళ్లు పోస్తూ ఉంటే సమస్యలు రావు.
ఇవి కూడా చదవండి
Sheikh Hasina: మహ్మద్ యూనస్ దేశాన్ని అమెరికాకు అమ్మేశాడు.. మాజీ ప్రధాని షేక్ హసీనా..
Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్‌పై ట్రాన్స్‌జెండర్ల దారుణం..