Share News

Break Fast Mistakes to Avoid: అల్పాహారం పొరపాట్లు

ABN , Publish Date - May 13 , 2025 | 06:43 AM

ఉదయాన్నే సరైన అల్పాహారం తీసుకోవడం మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. అల్పాహారంలో ప్రోటీన్‌, పీచు ఉండాలని, తీపి పదార్థాలు, ఖాళీ కడుపున కాఫీ తాగకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

Break Fast Mistakes to Avoid: అల్పాహారం పొరపాట్లు

ఆహారం ఆరోగ్యం

దయం సరైన అల్పాహారం తీసుకుంటే రోజంతా హుషారుగా ఉండడంతో పాటు శరీరం శక్తిని ఖర్చు చేసే వేగం (మెటబాలిజం) మెరుగుపడుతుంది. అయితే అల్పాహారం విషయంలో చేసే పొరపాట్లు మెటబాలిజంను మందగించేలా చేస్తాయి. కాబట్టి ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

  • ఉదయం అల్పాహారం తీసుకోకుండా ఉండకూడదు. అల్పాహారం తీసుకోకపోతే శరీరం శక్తిని ఖర్చు చేసుకునే వేగం మందగిస్తుంది. అంతేకాకుండా ఉదయం తినకపోవడం వల్ల మిగిలిన రోజంతా అతిగా తినే ప్రమాదం ఉంటుంది. దాంతో అధిక బరువు పెరుగుతారు.

  • ఉదయాన్నే తీపి పదార్థాలు తినకూడదు. అలా తింటే రక్తంలో చక్కెర స్థాయులు పెరిగిపోయి శక్తి తగ్గుతుంది. దాంతో మెటబాలిజం నెమ్మదిస్తుంది.

  • ప్రోటీన్‌ ఉన్న అల్పాహారం తినాలి. ప్రోటీన్‌ కడుపు నిండిన భావనతో పాటు కండరపుష్ఠికి తోడ్పడుతుంది. ఇది మెటబాలిజం మెరుగుదలకు సహాయపడుతుంది.

  • అల్పాహారం ఆలస్యంగా తీసుకోకూడదు. అల్పాహారం ఆలస్యమైతే మెటబాలిజం నిర్వహణలో కీలక పాత్ర పోషించే శరీర జీవగడియారం దెబ్బతింటుంది.

  • పీచు అందించే అల్పాహాలం తీసుకోవాలి. పీచు, పేగుల ఆరోగ్యాన్ని సంరక్షించడంతోపాటు మెటబాలిజంను మెరుగుపరుస్తుంది. క్యాలరీలను సమర్ధవంతంగా ఖర్చు చేయడంలోనూ పీచు ముఖ్య పాత్ర

  • పోషిస్తుంది.

  • పరగడుపున కాఫీ తాగకూడదు. ఖాళీ కడుపుతో కాఫీ తాగితే కార్టిసాల్‌ పెరుగుతుంది. దీని వల్ల చక్కెర నియంత్రణకు ఆటంకం ఏర్పడుతుంది. దాంతో కాలక్రమేణా మెటబాలిజం మందగిస్తుంది.

Updated Date - May 13 , 2025 | 06:45 AM