Share News

PV Srilakshmi: సరిహద్దుల్లో పారాహుషార్‌

ABN , Publish Date - May 01 , 2025 | 04:19 AM

భారత పారామిలిటరీ దళాల్లో మొట్టమొదటి మహిళా డాగ్‌ హ్యాండ్లర్‌గా శ్రీలక్ష్మి పీవీ చరిత్ర సృష్టించారు. అస్సామ్‌ రైఫిల్స్‌లో శిక్షణ పూర్తి చేసి దేశ భద్రతలో కీలకమైన కేనైన్‌ యూనిట్‌లో సేవలందించనున్నారు.

PV Srilakshmi: సరిహద్దుల్లో పారాహుషార్‌

పహల్గాం దుర్ఘటన పటిష్ఠమైన దేశ సరిహద్దు భద్రతను ప్రశ్నించేలా సింది. కానీ దేశ సరిహద్దు భద్రత పరంగా వివిధ రకాల బలగాలు వైవిధ్యమైన ర్గాల్లో సైనికులకు నిరంతర శిక్షణను అందిస్తూనే ఉంటాయి. అలాంటి బలగాల్లో ఒకటైన అస్సామ్‌ రైఫిల్స్‌. తాజాగా మహిళా డాగ్‌ హాండ్లర్‌, రైఫిల్‌ ఉమన్‌ శ్రీలక్షి పీవీ శిక్షణ పూర్తి చేసి, చరిత్రలో ఒక ప్రత్యేకమైన మైలురాయిని అందుకుంది. పారామిలిటరీ బలగాల్లో మొట్టమొదటి మహిళా డాగ్‌ హ్యాండ్లర్‌గా గుర్తింపు పొందిన శ్రీలక్ష్మి గురించిన ఆసక్తికరమైన వివరాలు. సైన్యంలో, మరీ ముఖ్యంగా భద్రతా బలగాల్లో మహిళల పాత్ర పరిమితమే! అయినప్పటికీ కొందరు మహిళలు తమ సత్తాను చాటుకుంటూ పురుషులతో సమానంగా ప్రతిభ కనబరుస్తూనే ఉంటారు. సరిహద్దు భద్రత, తిరుగుబాట్ల అణచివేత, ఈశాన్య భారత దేశంలో, జమ్ము కశ్మీరులో రాష్ట్రీయ రైఫిల్స్‌లో శాంతిభద్రతల నిర్వషణకు బాధ్యత వహించే భారతదేశ పారామిలిటరీ దళం, అస్సామ్‌ రైఫిల్స్‌. ఇండో మయన్మార్‌ సరిహద్దును రక్షించడం వీరి ప్రాథమిక విధి.

నాలుగు శాతమే...

సరిహద్దు భద్రత కోసం పారామిలిటరీ బలగాలు కఠోరమైన శిక్షణ పొందుతూ ఉంటాయి. ఇలాంటి ఎంతో కీలకమైన, సంక్లిష్టమైన భారతీయ పారా మిలిటరీ బలగాల్లో, ప్రత్యేకించి ముప్పు అత్యంత ఎక్కువగా ఉండే పాత్రల్లో మహిళల సంఖ్యను పెంచుతున్నట్టు అస్సామ్‌ రైఫిల్స్‌ ప్రకటించింది. 2030 నాటికి 10ు మహిళల భాగస్వామ్యం లక్ష్యంగా వ్యూహాత్వక ప్రణాళికలు రచిస్తున్న అస్సాం రైఫిల్స్‌లో ప్రస్తుతం 4 శాతం మంది మహిళలు పని చేస్తున్నారు. వాళ్లలో శ్రీలక్షి పివి ఒకరు. ఈమె స్వస్థలం, ఇతరత్రా వివరాలను గోప్యంగా ఉంచిన అస్సాం రైఫిల్స్‌, తాజాగా ఆమె శిక్షణకు సంబంధించిన కొన్ని వివరాలను మాత్రమే ఎక్స్‌ వేదికగా ప్రకటించింది.

కఠినమైన కేనైన్‌ యూనిట్‌

లింగ వైవిద్యం లక్ష్యంగా అస్సామ్‌ రైఫిల్స్‌ చేపట్టిన నియామకాల్లో ఎంపికైన శ్రీలక్ష్మి, ప్రత్యేకమైన కేనైన్‌ శిక్షణకు ముందు, కఠినమైన భౌతిక, మానసిక పరీక్షలకు లోనైంది. ప్రాథమిక నియామకం నుంచి, డాగ్‌ హ్యాండ్లింగ్‌ స్పెషలి్‌స్టగా పేలుడు పదార్థాలను పసిగట్టడం మొదలు, రాత్రివేళ సంచారం, అధునాతన విధేయత ప్రొటోకాల్‌ వరకూ అన్ని మెలకువల మీదా పట్టు సాధించింది. ప్రతిభ, చురుకుదనం, అత్యంత ఒత్తిడితో కూడిన వాతావరణాల్లో మెరుగ్గా వ్యవహరించే నైపుణ్యాల ఆధారంగా శ్రీలక్ష్మి ఎంపికైంది. దేశ భద్రతలో కుక్కల పాత్ర కూడా ప్రత్యేకమైనదే! వీటి ఇంద్రియ సామర్థ్యాన్ని దేశ భద్రతకు ఉపయోగించుకునే విభాగం ‘కేనైన్‌ యూనిట్‌’. ఈ కేనైన్‌ స్క్వాడ్‌ ఆధునిక భద్రతా వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.

gth.jpg

కాబట్టి శిక్షణ పొందిన కుక్కలను చొరబాటుదారులను పసిగట్టడం, పేలుడు పదార్థాలను కనిపెట్టడం, విపత్తుల్లో బాఽధితులకు సహాయ సహకారాలు అందించడం, సరిహద్దులో భద్రతను పెంచడం లాంటి సేవల కోసం వినియోగిస్తూ ఉంటారు. కేనైన్‌ స్క్వాడ్‌కు సంబంధించిన ‘బెల్జియన్‌ మాలినోయిస్‌’ అనే జాతి కుక్కకు శ్రీలక్ష్మి, డాగ్‌ హ్యాండ్లర్‌గా వ్యవహరిస్తోంది. తీవ్ర ఘర్షణలు నెలకొని ఉన్న ప్రాంతాల్లో చురుగ్గా వ్యవహరించే కుక్కలుగా ఈ జాతికుక్కలు పేరు పొందాయి.


ప్రత్యక్ష పోరాటాల్లో సైతం...

శిక్షణలో భాగంగా డాగ్‌ హ్యాండ్లర్లు, తమకు కేటాయించిన కుక్కతో క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయించడంతో పాటు, వాటి ప్రవర్తనను నియంత్రిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీరు కుక్కతో పాటు ప్రత్యక్ష పోరాటాల్లో కూడా పాల్గొనవలసి వస్తూ ఉంటుంది. అస్సాం రైఫిల్స్‌తో మొట్టమొదటి డాగ్‌ హ్యాండ్లర్‌గా గుర్తింపు పొందిన శ్రీలక్ష్మి, ధైర్యం, దృఢ సంకల్పం, మక్కువలను ప్రదర్శించి, పురుషాధిక్య రంగంలో మార్గదర్శక ప్రయాణాన్ని ప్రారంభించింది. మరెంతో మంది మహిళలు స్ఫూర్తిదాయకమైన శ్రీలక్ష్మి అడుగుజాడలను అనుసరించాలని కోరుకుందాం!


Also Read:

BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్‌ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ

Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..

Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..

Updated Date - May 01 , 2025 | 06:22 AM