Overcoming Panic Attacks: ప్యానిక్ అటాక్స్‌కు చెక్
ABN , Publish Date - May 13 , 2025 | 07:07 AM
ప్యానిక్ అటాక్స్ నుండి బయటపడటానికి శ్వాస వ్యాయామాలు, ఇంద్రియాలను ఉపయోగించే చిట్కాలు సహాయపడతాయి. దీని ద్వారా ధైర్యం సేకరించి, మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవచ్చు.
మానసికం
అకస్మాత్తుగా గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. శ్వాస తీసుకోవడం కష్టమైపోతుంది. మాట పెగలదు. ఇవన్నీ ప్యానిక్ అటాక్స్ లక్షణాలు. అయితే కొన్ని చిట్కాలతో ఆ పరిస్థితి నుంచి బయటపడొచ్చు. అదెలాగంటే..
శ్వాసతో...
నెమ్మదిగా నాలుగు అంకెలు లెక్కబెడుతూ శ్వాస పీల్చుకోవాలి
గాలి పీల్చుకున్న తర్వాత నాలుగు అంకెలు లెక్కబెట్టాలి
తర్వాత నాలుగు అంకెలు లెక్కపెడుతూ శ్వాస వదలాలి
పరిస్థితి మెరుగయ్యేవరకూ ఇలాగే శ్వాస తీసుకుని, వదులుతూ ఉండాలి
చూపు, స్పర్శ, రుచి
కంటికి ఎదురుగా కనిపించే ఐదు వస్తువుల పేర్లు చెప్పాలి
నాలుగు వస్తువులను తాకాలి
3 శబ్దాలను వివరించాలి
రెండు వాసనలను పసిగట్టాలి
ఒక పదార్థాన్ని రుచి చూడాలి
ఇలా చేయడం వల్ల
ధ్యాస మరలి నెమ్మది
చేకూరుతుంది
భరోసా
ప్యానిక్ అటాక్స్ తాత్కాలిక మైనవనీ, అవి వచ్చినంత వేగంగా మాయమై పరిస్థితి సర్దుకుంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకుని మనకి మనం ధైర్యం చెప్పుకోవాలి.