Share News

Loneliness Tips: ఒంటరితనం వేధిస్తోందా

ABN , Publish Date - Aug 06 , 2025 | 01:02 AM

ఒక్కోసారి అనుకోని కారణాల వల్ల ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో అనవసరమైన ఆలోచనలు

Loneliness Tips: ఒంటరితనం వేధిస్తోందా

ఒక్కోసారి అనుకోని కారణాల వల్ల ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో అనవసరమైన ఆలోచనలు వేధిస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కుంగిపోకుండా ఆనందంగా ఎలా గడపాలో తెలుసుకుందాం...

  • రోజూ కొద్దిసేపు ఇంటి పరిసరాల్లో వాకింగ్‌ చేయడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల కొత్త స్నేహాలు ఏర్పడవచ్చు. మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. వ్యాయామం, ధ్యానం లాంటివి కూడా ఉపకరిస్తాయి.

  • ఆత్మీయులకు ఫోన్‌ చేసి కొద్దిసేపు మాట్లాడడం వల్ల ఒంటరితనం అనే భావన కలుగదు. వీడియో కాల్‌ అయితే వెంటనే మనసు కుదుపడుతుంది.

  • ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండడం వల్ల ఒంటరిగా ఉన్నామనే ఆలోచన రాదు. ఇంటి పని, తోటపని లేదంటే ఆఫీసు పని ఇలా ఆసక్తి ఉన్నదానిమీద మనసు నిలిపితే ప్రయోజనకరంగా ఉంటుంది.

  • వంట చేయడం, సంగీతం వినడం, పుస్తకాలు చదవడం, కొత్త ప్రదేశాలను సందర్శించడం లాంటి వి అలవాటు చేసుకుంటే ఒంటరితనం వేధించదు.

  • ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకోవాలి. ఏకాంతంగా గడపడం వల్ల శక్తిని పుంజుకుని ఉత్సాహంగా ఉండగల్గుతారు.

  • వీలైనప్పుడల్లా వృద్ధులకు, చిన్న పిల్లలకు అలాగే ఇతరులకు చేతనైన సహాయం చేస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది.

  • వ్యక్తిగత శ్రద్ధ, సమాజసేవ, ఇరుగు పొరుగు పిల్లలతో ఆడుకోవడం, నూతన సాంకేతిక పరిజ్ఞాననంపై అవగాహన పెంచుకోవడం, సమకాలిక

  • పరిస్థితుల్లో వస్తున్న మార్పులు తెలుసుకోవడం లాంటివి చేస్తూ సమాజంతోపాటు నడుస్తూ ఉంటే ఒంటరితనమనే భావన మాయమవుతుంది.

Updated Date - Aug 06 , 2025 | 01:02 AM