Share News

Mental Strength Tips: మానసిక బలాన్ని ఇలా పెంచుకుందాం

ABN , Publish Date - May 12 , 2025 | 05:24 AM

అపజయాలు ఎదురైనప్పుడు మనోబలాన్ని పెంచుకోవడానికి సానుకూల దృక్పథం, భావోద్వేగ నియంత్రణ, ఆత్మవిశ్వాసం అవసరం. స్నేహితులతో ముచ్చట్లు, సంగీతం, ఆటలు మనసుకు ఉపశమనం కలిగిస్తాయి.

Mental Strength Tips: మానసిక బలాన్ని ఇలా పెంచుకుందాం

కస్మాత్తుగా అపజయాలు ఎదురైనప్పుడు అనుకున్నది సాధించలేకపోయామన్న భావన వేధిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో మానసిక బలాన్ని పెంపొందించుకోవడానికి నిపుణులు చెబుతున్న చిట్కాలివి...

  • మానసికంగా బలంగా ఉండాలంటే సానుకూల దృక్పథాన్ని అలవరచుకోవాలి. అనుకున్నది జరగనప్పుడు కుంగిపోకుండా వైఫల్యానికి కారణాలను తెలుసుకోవాలి.

  • ఏదైనా కొత్త పనిని తలపెట్టినప్పుడు పాత విధానాన్ని కాకుండా విభిన్న మార్గాన్ని ఎంచుకోవాలి.

  • పనులను వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు వాటిని పూర్తిచేయడం అలవాటు చేసుకోవాలి.

  • చుట్టూ ఉన్న పరిస్థితులను అంగీకరించడం నేర్చుకోవాలి. మార్చలేని, నియంత్రించలేని అంశాల గురించి అతిగా ఆలోచించి సమయం వృథా చేసుకోకూడదు.

  • గతంలో సాధించిన విజయాలను గుర్తుచేసుకోవాలి. దీనివల్ల మళ్లీ ప్రయత్నించాలనే భావన కలుగుతుంది.

  • తోటివారితో స్నేహంగా మెలగడం అలవాటు చేసుకోవాలి. . భావోద్వేగాలను నియంత్రిచుకోవాలి.

  • ఇష్టమైన ఆటలు ఆడడం, సంగీతం వినడం, నృత్యం చేయడం, స్నేహితులతో సరదాగా ముచ్చటించడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఆందోళన తగ్గుతుంది.

Updated Date - May 12 , 2025 | 05:25 AM