Share News

Foot Tan Removal Tips: చెప్పుల మచ్చలా

ABN , Publish Date - May 17 , 2025 | 05:06 AM

పాదాలపై చెప్పుల మచ్చలాంటివి కనిపిస్తే టమాటా, నిమ్మరసం మిశ్రమం లేదా శనగపిండి, పెరుగు ప్యాక్‌లను ఉపయోగించి వాటిని తొలగించవచ్చు. ఇవి చర్మాన్ని శుభ్రం చేసి మళ్లీ సహజ రంగు తెస్తాయి.

Foot Tan Removal Tips: చెప్పుల మచ్చలా

చెప్పులు లేదా షూల ఆకారంలో పాదాలమీద గుర్తులు కనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడు చిన్న చిట్కాలు పాటించి ఆ గుర్తులను పోగొట్టుకోవచ్చు.

  • ఒక గిన్నెలో రెండు చెంచాల టమాటా రసం, ఒక చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు పట్టించి పావుగంట అలాగే ఉంచాలి. తరవాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తూ ఉంటే రంగు మారిన పాదాలు యథాస్థితికి వస్తాయి. టమాటాలోని లైకోపిన్‌... చర్మం మీద సూర్యకాంతి ప్రభావాన్ని తగ్గిస్తుంది. నిమ్మరసం సహజ బ్లీచింగ్‌ ఏజెంట్‌లా పనిచేస్తుంది.

  • గిన్నెలో రెండు చెంచాల శనగపిండి, నాలుగు చెంచాల పెరుగు, అర చెంచా పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు పట్టించాలి. బాగా ఆరిన తరవాత చేతితో మెల్లగా మర్థన చేస్తూ పిండిని తొలగించాలి. తరవాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే పాదాలు రంగు తిరుగుతాయి. పెరుగులోని లాక్టిక్‌ ఆమ్లం... చర్మం మీద మృతకణాలను తొలగిస్తుంది. శనగపిండి చర్మ రంధ్రాలను శుభ్రం చేస్తుంది.

Updated Date - May 17 , 2025 | 05:09 AM