Share News

Diarrhea Remedies: విరేచనాలు అవుతూ ఉంటే

ABN , Publish Date - Apr 30 , 2025 | 03:57 AM

వాతావరణ మార్పులు, కలుషిత ఆహారం, జీర్ణ సమస్యల వల్ల విరేచనాలు తలెత్తుతాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఇంటి వద్ద ఉండే సహజ పదార్థాలతో చిన్న చిట్కాలు పాటించవచ్చు.

Diarrhea Remedies: విరేచనాలు అవుతూ ఉంటే

వాతావరణ మార్పులు, తినే ఆహార పదార్థాలు కలుషితం కావడం, జీర్ణ సమస్యల వల్ల విరేచనాలు అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు చిన్న చిట్కాలు పాటించి ఉపశమనం పొందవచ్చు.

నీళ్ల విరేచనాలు అవుతుంటే కొబ్బరి నీళ్లు తాగడం ఉత్తమం. దీనివల్ల శరీరం కోల్పోయిన నీటి శాతం భర్తీ అవుతుంది. కొబ్బరి నీళ్లలోని మినరల్స్‌, ఎలకో్ట్రలైట్స్‌ శరీరానికి సత్తువను అందిస్తాయి.

ఒక గ్లాసు మంచినీళ్లలో చిటికెడు ఉప్పు, ఒక చెంచా పంచదార కలుపుకుని తాగితే... విరేచనాల వల్ల కలిగే అలసట, నీరసం తగ్గుతాయి.

అల్లం రసం లేదా అల్లం టీ తాగడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. అల్లంలోని యాంటీ మైక్రోబియల్‌ గుణాలు జీర్ణ సమస్యలను నివారిస్తాయి.

పెరుగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి ప్రేవులను శుభ్రం చేస్తాయి. అర గ్లాసు పెరుగులో ఒక చెంచా మెంతులు కలుపుకుని తీసుకుంటే వెంటనే విరేచనాలు తగ్గుతాయి.


ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా జీలకర్ర వేసి బాగా మరగించి గోరువెచ్చగా చల్లార్చి తాగితే కడుపులో సమస్యలు తగ్గి విరేచనాలు ఆగుతాయి.

నాలుగు పుదీనా ఆకులను నమిలినా... పుదీనా టీ తాగినా... సమస్య తీరుతుంది. ఒక చెంచా గ్రీక్‌ యోగర్ట్‌ తింటే వెంటనే ఫలితం కనిపిస్తుంది.

ఒక కప్పు గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ కలుపుకుని తాగితే విరేచనాలు తగ్గుతాయి.

ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే ప్రయోజనం కనిపిస్తుంది.

స్టవ్‌ మీద గిన్నె పెట్టి అందులో అర గ్లాసు నీళ్లు, మూడు చెంచాల పటిక బెల్లం వేసి బాగా మరగించాలి. నీళ్లు కొద్దిగా పాకంలా మారాక స్టవ్‌ మీద నుంచి దించాలి. ఈ పాకాన్ని చెంచాతో తీసుకుంటూ మెల్లగా తాగాలి. పావు గంటలో విరేచనాలు తగ్గుతాయి.


ఇవి కూడా చదవండి..

Pakistan: భారత 'గూఢచారి డ్రోన్‌'ను కూల్చేశామన్న పాక్

Kashmir: కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులకు స్కెచ్.. 48 టూరిస్ట్ స్పాట్స్ మూసివేత..

Viral News: పాకిస్తాన్‎ను 4 ముక్కలు చేయాలి..ఇలా చేస్తేనే వారికి మేలు..

Updated Date - Apr 30 , 2025 | 05:23 AM