Cancer Cases: క్యాన్సర్ ముప్పు పెరుగుతోంది
ABN , Publish Date - Jan 11 , 2025 | 04:47 AM
గత ఏడాది మన దేశంలో క్యాన్సర్ కేసులు అంతకుముందు ఏడాది కంటే 12% పెరిగాయి. క్యాన్సర్ తర్వాత.. గుండె జబ్బులు,
40 ఏళ్ల పైబడిన వారిలోఎక్కువ కేసులు: మెడి అసిస్ట్
ముంబై, జనవరి 10: గత ఏడాది మన దేశంలో క్యాన్సర్ కేసులు అంతకుముందు ఏడాది కంటే 12% పెరిగాయి. క్యాన్సర్ తర్వాత.. గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు భారతీయులను అధికంగా వేధించాయి. 2024లో ఆరోగ్య బీమా కంపెనీలకు వచ్చిన క్లెయిమ్‌ల ఆధారంగా ‘మెడి అసిస్ట్ హెల్త్‌కేర్ సర్వీసెస్’ అనే సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. వీటి ప్రకారం.. క్యాన్సర్ క్లెయిమ్‌లు 40 ఏళ్లకు మించిన వయస్సు ఉన్నవారిలో, మహిళల్లో పెరిగాయి. పురుషులతో పోల్చితే స్త్రీలలో క్యాన్సర్‌కు సంబంధించిన క్లెయిమ్‌లు 1.2-1.5 రెట్లు అధికంగా నమోదయ్యాయి. గుండె జబ్బుల విషయంలో మాత్రం.. మహిళలకన్నా పురుషుల్లోనే క్లెయిమ్‌లు ఎక్కువగా (1.3-1.5 రెట్లు) ఉన్నాయి.