Share News

BREAKING: నేడు తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ

ABN , First Publish Date - Dec 09 , 2025 | 07:03 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

BREAKING: నేడు తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ

Live News & Update

  • Dec 09, 2025 11:02 IST

    2009లో ఇదేరోజు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది: రేవంత్‌

    • అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఆవిష్కరించాం: రేవంత్‌

    • ఆరు దశాబ్దాల ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేర్చింది

    • అడ్డంకులు అధిగమించి మరీ సోనియా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు

    • సోనియా, మన్మోహన్‌ స్ఫూర్తితోనే మా ప్రభుత్వ పథకాలు: రేవంత్‌

  • Dec 09, 2025 11:01 IST

    హైదరాబాద్‌: HCA అండర్‌ 14 క్రికెట్‌ సెలక్షన్స్‌లో ఉద్రిక్తత

    • జింఖానా గ్రౌండ్‌లో సెలక్షన్స్‌కు హాజరైన పలువురు ప్లేయర్లు

    • HCA నిర్వాహకుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం

    • ఏర్పాట్లు సరిగా చేయలేదని విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

  • Dec 09, 2025 11:01 IST

    భూమి వివాదంలో BRS ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి

    • మేడ్చల్ సుచిత్ర సెంటర్‌లో కొన్నేళ్లుగా భూ వివాదం

    • సర్వే నెంబర్‌ 82, 83లో 1.29 ఎకరాల్లో 33 గుంటల స్థలాన్ని..

    • మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి కబ్జా చేశారంటూ బాధితుడి ఆరోపణ

    • మల్లారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలోనే కబ్జా చేశారని శ్రీనివాస్‌రెడ్డి ఆవేదన

    • భూ వివాదం నేపథ్యంలో ల్యాండ్ సర్వే చేపట్టిన రెవెన్యూ అధికారులు

    • తమ స్థలాన్ని కాజేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ మల్లారెడ్డి ఆరోపణ

    • పోలీసు బందోబస్తు మధ్య కొనసాగుతున్న భూసర్వే

  • Dec 09, 2025 09:47 IST

    హైదరాబాద్‌కు రావాల్సిన 14 ఇండిగో విమానాలు రద్దు

    • హైదరాబాద్‌ నుంచి వెళ్లాల్సిన 44 ఇండిగో విమానాలు రద్దు

    • విశాఖ నుంచి వెళ్లాల్సిన 6 ఇండిగో విమానాలు రద్దు

  • Dec 09, 2025 09:13 IST

    ఏజెన్సీ ప్రాంతాల్లో పెరిగిన చలి తీవ్రత

    • పలు చోట్ల సింగిల్‌ డిజిట్‌కు పడిపోయిన టెంపరేచర్‌

    • ఏజెన్సీల్లో దట్టంగా పొగమంచు, తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు

    • వినుములూరులో 5, అరకు, చింతపల్లిలో 3, పాడేరులో 4 డిగ్రీలు

  • Dec 09, 2025 08:40 IST

    తెలంగాణలో 2026 ఏడాదికి సెలవులు ఖరారు

    • 2026లో మొత్తంగా 27 సాధారణ సెలవులు

    • మరో 26 ఆప్షనల్‌ సెలవులను కేటాయించిన ప్రభుత్వం

  • Dec 09, 2025 08:39 IST

    జీహెచ్‌ఎంసీ వార్డులను 300కు పెంచుతూ ఉత్తర్వులు

    • జీహెచ్‌ఎంసీలో వార్డుల సంఖ్య 150 నుంచి 300కు పెంపు

    • ఇటీవల GHMCలో 27మున్సిపాలిటీలను విలీనంచేసిన సర్కార్

  • Dec 09, 2025 07:27 IST

    మహారాష్ట్ర సామాజిక, కార్మిక ఉద్యమ కారుడు డా. బాబా ఆడావ్‌ (95) కన్నుమూత

    • దీర్ఖకాలిక అనారోగ్యంతో పుణెలో బాబా ఆడావ్‌ తుదిశ్వాస

    • ఆటో డ్రైవర్లు, వీధి వ్యాపారులు, కార్మికుల హక్కుల కోసం పోరాడిన బాబా ఆడావ్‌

    • బాబా ఆడావ్ మృతిపట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

  • Dec 09, 2025 07:07 IST

    ఇండిగో సమస్యపై లోక్‌సభలో మంత్రి రామ్మోహన్‌ ప్రకటన చేసే అవకాశం

    • నేడు DGCA ఎదుట హాజరుకానున్న ఇండిగో ప్రతినిధులు

  • Dec 09, 2025 07:07 IST

    ఏడో రోజు పార్లమెంట్‌ సమావేశాలు

    • నేడు లోక్‌సభలో 'SIR'పై ప్రత్యేక చర్చ

  • Dec 09, 2025 07:07 IST

    నేడు సోనియా గాంధీ పుట్టిన రోజు

    • ఢిల్లీ, హైదరాబాద్‌లో సోనియా గాంధీ బర్త్‌డే వేడుకలు

  • Dec 09, 2025 07:06 IST

    ఏపీలో డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుచేయండి: మంత్రి లోకేష్

    • వెంచర్ క్యాపిటల్ సంస్థ సెలెస్టా వీసీ మేనేజింగ్ పార్టనర్ అరుణ్ కుమార్‌తో లోకేష్ భేటీ

    • ఐటీ, డేటా హబ్‌గా విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది

    • ఏపీలో సెలెస్టా క్యాపిటల్ డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుచేయండి: లోకేష్

    • సెమీకండక్టర్, AI, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి

    • పలు కంపెనీలకు ఏపీ ప్రభుత్వం దేశంలోనే అత్యుత్త ప్రోత్సాహకాలను అందిస్తోంది

    • పరిశ్రమలకు నేరుగా ప్రోత్సాహకాలను అందించేందుకు..

    • దేశంలోనే తొలిసారిగా ఎస్క్రో అకౌంట్ విధానాన్ని ప్రారంభించాం: మంత్రి లోకేష్

  • Dec 09, 2025 07:06 IST

    నేటినుంచి భారత్‌లో అమెరికా వాణిజ్య బృందం పర్యటన

    • భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చ

  • Dec 09, 2025 07:06 IST

    నేటినుంచి భారత్‌ Vs సౌతాఫ్రికా 5 టీ20ల సిరీస్‌

    • కటక్‌లో రాత్రి 7 గంటలకు భారత్‌ Vs సౌతాఫ్రికా తొలి టీ20

  • Dec 09, 2025 07:05 IST

    నేడు తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ

    • సా.6 గంటలకు ఆవిష్కరించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

    • రాత్రి గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా డ్రోన్ల ప్రదర్శన

  • Dec 09, 2025 07:03 IST

    నేటినుంచి కల్తీ నెయ్యి కేసులో ఇద్దరు నిందితులకు 4 రోజుల కస్టడీ

    • సిట్ కస్టడీకి A-16 సుగందీ, A-29 సుబ్రహ్మణ్యం