US President Donald Trump: శ్వేతసౌధంలో ట్రంప్ కలల సౌధం
ABN, Publish Date - Oct 22 , 2025 | 05:51 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కలల ప్రాజెక్టుగా చెబుతున్న బాల్‌రూమ్ నిర్మాణానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. బాల్‌రూమ్ నిర్మాణం కోసం శ్వేతసౌధంలోని తూర్పు...
ఈస్ట్ వింగ్‌లో బాల్ రూమ్ పనులు ప్రారంభం.. వెల్లడించిన ట్రంప్
వాషింగ్టన్, అక్టోబరు 21: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కలల ప్రాజెక్టుగా చెబుతున్న బాల్‌రూమ్ నిర్మాణానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. బాల్‌రూమ్ నిర్మాణం కోసం శ్వేతసౌధంలోని తూర్పు విభాగంలో సోమవారం కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా ట్రూత్ సోషల్‌లో ప్రకటించారు. ‘వైట్‌హౌస్ మైదానంలోని తూర్పు విభాగం (ఈస్ట్ వింగ్)లో కొత్తగా అతిపెద్ద, అందమైన బాల్‌రూమ్ నిర్మాణానికి పనులు మొదలయ్యాయని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను’ అని ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. అమెరికా ప్రజలపై భారం పడకుండా దాతలు ఇచ్చే సొమ్ముతో ఈ బాల్‌రూమ్‌ను నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. ‘గత 150 సంవత్సరాలకుపైగా.. ప్రతి అమెరికా అధ్యక్షుడూ వైట్ హౌస్‌లో గ్రాండ్ పార్టీలు, అతిథుల కోసం ఒక బాల్‌రూమ్ ఉండాలని కలలు కన్నారు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది’ అన్నారు. వైట్‌హౌస్‌లో బాల్‌రూమ్ (నృత్యశాల)ను నిర్మించాలనేది డొనాల్డ్ ట్రంప్ చిరకాల స్వప్నం. వైట్‌హౌస్ ఈస్ట్‌వింగ్‌లో దీని నిర్మాణం చేపడతామని ఈ ఏడాది జూలైలో ట్రంప్ ప్రకటించారు. సుమారు రూ.2,200 కోట్ల (25 కోట్ల డాలర్లు) వ్యయంతో 90వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 999 మంది కూర్చునేలా ఈ బాల్‌రూమ్‌ను నిర్మించనున్నారు.
Updated Date - Oct 22 , 2025 | 05:51 AM