ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

india US Trade Talks: అమెరికా నుంచి మొక్కజొన్న దిగుమతి?

ABN, Publish Date - Sep 28 , 2025 | 01:06 AM

అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య చర్చల్లో.. ఇథనాల్‌ ఉత్పత్తి కోసం ఆ దేశం నుంచి మొక్కజొన్న కొనుగోలు చేసే అవకాశాలను భారతదేశం పరిశీలిస్తోంది...

  • ఇథనాల్‌ తయారీకి వినియోగించే అవకాశం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 27: అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య చర్చల్లో.. ఇథనాల్‌ ఉత్పత్తి కోసం ఆ దేశం నుంచి మొక్కజొన్న కొనుగోలు చేసే అవకాశాలను భారతదేశం పరిశీలిస్తోంది. అమెరికా నుంచి వచ్చిన ఈ తాజా ప్రతిపాదనల మేరకు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని చేసుకునే లక్ష్యంతో చర్చలు జరుగుతున్నాయి. తదుపరి చర్చలకు తేదీ, వేదిక ఇంకా ఖరారు కానప్పటికీ, నిర్దేశిత గడువులోకా వాణిజ్య ఒప్పందం చేసుకునే లక్ష్యంతో ఇరుపక్షాలూ చర్చల్లో పురోగతి కొనసాగిస్తున్నాయని ఓ ఆంగ్ల వార్తా సంస్థ కథనం పేర్కొంది. రష్యా నుంచి భారత్‌ ముడిచమురును కొనుగోలు చేసే అంశమే తాజా వాణిజ్య చర్చల్లో ప్రధాన అవరోధంగా ఉందని అమెరికా యంత్రాంగం చెబుతోంది. కాగా, రష్యా నుంచి చమురు దిగుమతులు ఈనెలలో సుమారు రోజుకు 2 లక్షల బ్యారళ్లకు పెరగనున్నట్టు భావిస్తున్నారు.

Updated Date - Sep 28 , 2025 | 01:06 AM