Hunger Surges in the U S: అమెరికాలో ఆకలి కేకలు!
ABN, Publish Date - Nov 03 , 2025 | 05:07 AM
అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌తో ఆకలి కేకలు మొదలయ్యాయి. ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాల నిధులు నిలిచిపోవడంతో అక్కడి పేద ప్రజలు అల్లాడుతున్నారు...
షట్‌డౌన్‌తో అక్కడి పేదలకు నిలిచిపోయిన ప్రభుత్వ సాయం
వాషింగ్టన్, నవంబరు 2: అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌తో ఆకలి కేకలు మొదలయ్యాయి. ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాల నిధులు నిలిచిపోవడంతో అక్కడి పేద ప్రజలు అల్లాడుతున్నారు. కొన్ని రోజులుగా ఉచితంగా ఆహారం, సరుకులు పంచే కేంద్రాల వద్ద బారులు తీరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన బడ్జెట్‌ను అక్కడి చట్ట సభ సెనేట్ ఆమోదించకపోవడంతో.. ప్రభుత్వంలో ప్రతిష్టంభన (షట్‌డౌన్) పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే.
బడ్జెట్‌లో ప్రతిపాదించిన పలు కేటాయింపులను, అంశాలను మార్చాలని సెనేట్ కోరుతోంది. దానికి అధికార రిపబ్లికన్ల నుంచి సానుకూలత వ్యక్తం కావడం లేదు. షట్‌డౌన్ పరిస్థితి నెలకొన్నప్పుడు పలు అత్యవసర ఖర్చులకు మినహా ప్రభుత్వం ఎలాంటి వ్యయం చేయడానికి వీల్లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు కూడా నిలిచిపోతాయి. ఈ క్రమంలోనే అమెరికా ప్రభుత్వం నుంచి పేద ప్రజలు/అవసరార్థులకు ‘సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రొగ్రామ్ (ఎస్‌ఎన్‌ఏపీ)’ కింద ఇచ్చే నిధులు నిలిచిపోయాయి. ఎస్‌ఎన్‌ఏపీ కింద అమెరికాలో సుమారు 4.2 కోట్ల మందికి.. వారి పరిస్థితిని బట్టి ప్రతినెలా 200 డాలర్ల నుంచి 900 డాలర్ల వరకు సాయం అందుతుంది. ఇప్పుడా సాయం అందక.. స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు, చారిటీ సంస్థలు ఆహారం, నిత్యావసరాలు పంచేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. చాలా చోట్ల ఈ కేంద్రాలు త్వరగా ఖాళీ అవుతున్నాయి. దీనితో తెల్లవారుజామునే క్యూ కడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Infectious Diseases: భారత్‌లో పెరుగుతున్న అంటువ్యాధులు
Updated Date - Nov 03 , 2025 | 07:06 AM