Donald Trump: ‘హష్ మనీ’ కేసులో ట్రంప్ దోషే
ABN , Publish Date - Jan 11 , 2025 | 04:51 AM
హష్ మనీ కేసులో అమెరికా మాజీ-భావి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (78) దోషి అని మన్‌హట్టన్ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది.
న్యూయార్క్, జనవరి 10: హష్ మనీ కేసులో అమెరికా మాజీ-భావి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (78) దోషి అని మన్‌హట్టన్ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. అయితే ఆయన పది రోజుల్లో అధ్యక్షునిగా ప్రమాణం చేయనున్న దృష్ట్యా ఎలాంటి శిక్ష, జరిమానా విధించలేదు. కానీ శిక్ష పడ్డ అధ్యక్షునిగా చరిత్రలో నిలిచిపోతారు. రెండు దశాబ్దాల క్రితం ఆయనకు ఓ నీలి చిత్రాల నటీమణితో సంబంధాలు ఉండేవి. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆ విషయాన్ని బయట పెట్టకుండా ఉండేందుకు ‘హష్ మనీ’ రూపంలో ఆమెకు 1.3 లక్షల డాలర్లు (సుమారు రూ.కోటి) ఇచ్చినట్టు కేసు నమోదయింది. మామాలుగా అయితే నాలుగేళ్ల జైలు శిక్ష విధించాల్సి ఉంది. కానీ వివిధ రాజ్యాంగపర అంశాలను పరిగణనలోకి తీసుకొని శిక్ష విధించలేదని జడ్జి జౌన్ ఎం మర్చాన్ తెలిపారు.