Gandhi Truth Nonviolence Indias Freedom Legacy: సత్యోదయ సంతకం
ABN, Publish Date - Oct 02 , 2025 | 03:52 AM
సామాన్యుడు సత్య ప్రవాహమై మారి విశ్వశాంతి కాంతి కిరణాలను ప్రసరించాడు విద్వేష యుద్ధ మేఘాలను చీల్చుతూ అనంత అహింసా ప్రేమ వర్షాన్ని కురిపిస్తూ...
సామాన్యుడు సత్య ప్రవాహమై మారి
విశ్వశాంతి కాంతి కిరణాలను ప్రసరించాడు
విద్వేష యుద్ధ మేఘాలను చీల్చుతూ
అనంత అహింసా ప్రేమ వర్షాన్ని కురిపిస్తూ
అవనిపై మానవత్వ పసిడి పంటలు పండించాడు
సత్యాగ్రహాన్ని భారత స్వాతంత్ర్య శబ్దంగా చేసి
గుప్పెడు ఉప్పును ఆలోచనల ఉప్పెనగా మార్చి
ఉద్యమాలకు కొత్త రహదారులు వేశాడు
క్విట్ ఇండియా నినాదాల హోరు కనుసైగల్లో..
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి
ఓటమి చిరునామా లిఖించాడు
వందేమాతర స్ఫూర్తి శిఖరాన
మతసామరస్య జెండాను ఎగరేసి
మనందరికీ మహాత్ముడయ్యాడు
హి ఈజ్ నాట్ ఓన్లీ
ఎ మ్యాన్ ఆఫ్ ఇండియా...!
ఈ శతాబ్ద కాల నడవడికకు
చేతికర్ర అయ్యాడు
భవిష్యత్ తరాల బతుకు రాతకు
భగవద్గీతగా నిలిచాడు
ఫిజిక్స్ అరుణ్‌కుమార్
(నేడు గాంధీ జయంతి)
ఈ వార్తలు కూడా చదవండి..
నగదు ఇస్తానన్నా వదల్లేదు.. బాధితురాలి ఆవేదన..
For More AP News And Telugu News
Updated Date - Oct 02 , 2025 | 03:52 AM